NLR: ఉదయగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా ఆరోగ్య అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి నుంచి అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వైద్యం అందించాలన్నారు.