సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా పూనకాలు తెప్పించాడు దర్శకుడు బాబీ. ఒక మెగాభిమానిగా మెగాస్టార్‌ను ఎలా చూపించాలనుకున్నాడో.. అలాగే చూపించాడు. వింటేజ్ చిరుని తెరపై చూసి తెగ మురిసిపోయారు అభిమానులు. చెప్పినట్టుగానే ఆచార్య ఫ్లాప్ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. దాంతో బాబీకి కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. మొత్తంగా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్‌ను ఫుల్ ఖుషీ చేశాడు బాబీ. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. చిరంజీవి కూడా ఓ మంచి కథతో చరణ్‌కు కమర్షియల్ హిట్ ఇవ్వాలని చెప్పారట. దాంతో బాబీ ఇప్పటికే రంగంలోకి దిగిపోయినట్టు సమాచారం. ఇదే నిజమైతే.. బాబీ మరోసారి పూనకాలు లోడింగ్ అనడం ఖాయం. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న చరణ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 చేస్తున్నాడు. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత చరణ్ కోసం చాలామంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లైన్లో ఉన్నారు. కన్నడ డైరెక్టర్ నర్తన్, తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా టచ్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు బాబీ కూడా లైన్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ బాబీతో చరణ్ కమిట్ అయితే మాత్రం.. రోటీన్ కమర్షియల్ మూవీ చేస్తే కష్టమే. చేస్తే ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ మూవీలా కొత్తగా ట్రై చేయాలి. లేదు మెగాభిమానిగా పూనకాలు లోడింగ్ అంటే కుదరదు. మరి బాబీ, చరణ్ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.