కాకినాడ: పిఠాపురం నియోజకవర్గంలో నవఖండ్రవాడ గ్రామానికి చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి నిట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ పొందారు. స్థానికులు కాలేజీలో చేరేందుకు ఆర్థిక సమస్యలు ఉన్న విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం ఆయన స్పందించి సోమవారం మంగళగిరి కార్యాలయంలో వారికి రూ.4 లక్షలు ఆర్థిక సహాయం చేశారు.