తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి 11 వరకు ఎంసెట్(ts eamcet 2023) ఇంజినీరింగ్, మే 12వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్,
ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఐసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తేదీలను కూడా ప్రకటించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రిలతో భేటీ నిర్వహించి ఈ మేరకు తేదీలను విడుదల చేశారు.
ఎగ్జామ్స్ ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలతో కూడా నోటిఫికేషన్ ను సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఇక పరీక్షల షెడ్యూల్ తేదీల వివరాలను క్రింద చూడవచ్చు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తేదీలు
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్) మే 7 నుంచి 11 వరకు
టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్) మే 12 నుంచి 14 వరకు
టీఎస్ ఎడ్ సెట్ (మహాత్మాగాంధీ యూనివర్సిటీ) మే 18
టీఎస్ ఈసెట్ (ఉస్మానియా యూనివర్సిటీ) మే 20
టీఎస్ లాసెట్, పీజీ ఎల్ సెట్ (ఉస్మానియా యూనివర్సిటీ) మే 25
టీఎస్ ఐసెట్ (కాకతీయ యూనివర్సిటీ) మే 26, 27
టీఎస్ పీజీఈసెట్ (జేఎన్టీయూ హెచ్) మే 29, 30, జూన్ 1