యువ నటుడు కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా మారాడు. జయపజయాలు పక్కన పెట్టి వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈనెల 17న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఇద్దరి ఇష్టాలు ఒక్కటైతే.. ఫోన్ నంబర్ ఇతివృత్తంలో ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది.
కిరణ్ సరసన కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మురళీ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ప్రొమోలు ప్రేక్షుకుల్లో ఆసక్తిని రేపాయి. ఎస్ఆర్ కల్యాణ మండపం, సమ్మతమే చిత్రాలతో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో మరో హిట్ అందుకోనున్నట్లు ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. మరి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.