శ్రద్ధావాకర్ బాడీని 17 ముక్కలు చేసినట్లు నిందితుడు అప్తాప్ విచారణలో అంగీకరించినట్లు ఛార్జీషీట్లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు 6600 పేజీలతో సుప్రీం కోర్టుకు ఛార్జీషీటును సమర్పించారు. ఇందులోని పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధను హత్య చేశాక అప్తాబ్ ఆమె ఎముకలను స్టోన్ గ్రైండర్తో పొడి చేసి దానిని దూరంగా విసిరేశాడు. చిట్టచివరిగా తలను మూడు నెలల తర్వాత డిస్పోజ్ చేశాడు. మే 18న శ్రద్ధను హత్య చేసిన తర్వాత జొమాటో నుండి చికెన్ రోల్ తెప్పించుకుని తిన్నాడట. శ్రద్ధా, అఫ్తాబ్ గత ఏడాది మేలో ఢిల్లీకి వచ్చారు. ఖర్చుల విషయం, అఫ్తాబ్ గర్ల్ ఫ్రెండ్స్ పలువురు దుబాయ్ నుండి ఢిల్లీకి రావడం వంటి అంశాల్లో ఇరువురి మధ్య ఘర్షణ జరిగేది. మే 18న ఇద్దరూ ముంబై వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. హఠాత్తుగా ఆ టిక్కెట్లను అఫ్తాబ్ క్యాన్సిల్ చేశాడు. టిక్కెట్ ఖర్చులపై ఇద్దరిమధ్య జరిగింది. అఫ్తాబ్ ఆమెను గొంతుపిసికి చంపేశాడు.
ఛార్జిషీటులో పేర్కొన్న వివరాల ప్రకారం శ్రద్ధను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాక్‌లో ప్యాక్ చేసి డిస్పోజ్ చేయాలని భావించాడు. ఇందుకోసం ఒక బ్యాగ్ కొన్నాడు. అయితే, బ్యాగుతో పట్టుబడే అవకాశాలున్నాయని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆలోచించి, చివరకు శరీర భాగాలు కత్తిరించాలని, రంపం, సుత్తి, మూడు కత్తులు కొన్నాడు. బ్లోటార్చ్తో వేళ్లు వేరుచేశాడు. 35 ముక్కలుగా మృతదేహాన్ని నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ప్యాక్‌ను ఫ్రిజ్ నుండి తీసి, కిచెన్‌లో దాచిపెట్టేవాడు. శ్రద్ధ సెల్‌ఫోన్‌నూ దాచిపెట్టాడు. మే 18 తర్వాత కూడా ఆమె మొబైల్ పని చేసినట్టు డాటా వెల్లడించింది. ఆ తర్వాత మొబైల్, ఆమె వాడే లిప్‌స్టిక్‌ను డిస్పోజ్ చేశాడు. శ్రద్ధ బాడీకి చెందిన 20 భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల ఆచూకీ దొరకలేదు. గత ఏడాది చివరలో అఫ్తాబ్‌కు పోలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షలు జరపగా, హత్య చేసినట్లు అంగీకరించాడు. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతున్నట్టు అఫ్తాబ్ పేర్కొన్నట్లు ఛార్జీషీట్లో ఉంది. ఢిల్లీ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికతో పాటు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు.