WG: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ జిల్లా పరిషత్ యాజమాన్యంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 17న ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసినందున, ఈ బదిలీలు చేపట్టబడ్డాయి. ఈ బదిలీలలో జిల్లా పరిషత్ యాజమాన్యంలోని అన్ని కేడర్లలో 429 మందిని బదిలీలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.