టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం.
‘కనీసం కొత్త ఫోన్ ను అన్ బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్ ను చూశారా?’ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. కాగా… ఈ ట్వీట్ కి కొందరు అభిమానులు సానుభూతి వ్యక్తం చేయగా… జొమాటో మాత్రం చాలా ఫన్నీగా స్పందించింది.
‘బాబీ ( వదిన) ఫోన్ నుంచి ఐస్ క్రీం ఆర్డర్ చేయడానికి సంకోచించకండి’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా ప్రస్తుతం ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం కోహ్లీ రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్ పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.