మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్…చాలా కాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఆయన తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తను బూతులు తిట్టడం గమనార్హం. ఆ తిట్టే క్రమమంలో ఆయన బండి సంజయ్ పై కూడా విమర్శలు చేయడం గమనార్హం. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు బాబూమోహన్. దీంతో… ఆయనపై విమర్శలు వినపడుతున్నాయి.
ఇంతకీ మ్యాటరేంటంటే…. ఆంథోల్ నియోజకవర్గం నుంచి వెంకట రమణ అనే ఓ బీజేపీ కార్యకర్త బాబూమోహన్ కు ఫోన్ చేసి సార్ నేను మీతో కలిసి పార్టీ కోసం పనిచేద్దామనుకుంటున్నాను అన్నారు. దీంతో నువ్వెంత నీ బతుకెంత నాతో కలిసి పనిచేస్తావా? నేనెవరు నీకు తెలుసా? నేను ప్రపంచ స్థాయి నాయకుడిని..అటువంటి నాతో కలిసి పనిచేస్తావా? నువ్వెంత నీ బతుకెంత? మరోసారి ఫోన్ చేశావంటే చెప్పుతో కొడతా అంటూ రెచ్చిపోయారు.
బండి సంజయ్ పేరు తీసుకురాగా…. ఎవర్రా బండి సంజయ్ అని కూడా అనడం గమనార్హం. కాగా… గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీలో ఆంథోల్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు కూడా సొంతపార్టీ కార్యకర్తలపై దూకుడుగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి సొంతపార్టీ కార్యకర్తపై బూతుపురాణానికి తెరలేపారు.