VSP: వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్ను నుంచి ఉపశమనం లభించింది. చెత్త సేకరణకు ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో నగరవాసులపై ప్రతి నెలా రూ. 7. 77 కోట్లు భారం తగ్గినట్టయింది. సీఎం ప్రకటనపై నగరవాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నివాస భవనాలను నెలకు రూ. 120 చొప్పున వసూలు చేసేవారని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.