TG: సింగరేణి కార్మికులకు తమ హయాంలో న్యాయం చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ ఏడాది రూ.4,700 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు.