తమిళనాడు సినిమా నిర్మాతలు హీరోల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. హీరో ధనుష్ కు ఊహించని షాక్ ను ఇచ్చారు. ధనుష్ తో పాటు విశాల్, శింబు లకు కూడా ఇది ఒక మెర షాక్ అనే చెప్పాలి. ఆగష్టు 15 తరువాత హీరో ధనుష్ తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పసరి అని ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే తమిళ హీరోల్లో చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్స్ ల రూపంలో భారీ మొత్తాన్ని తీసుకుని ఇప్పుడు సినిమాలు చేయకుండా మొహం చాటేస్తున్నారని చాలా మంది నిర్మాతలు మండలి లో ఫిర్యాదుచేశారు
చాలా ఫిర్యాదుల అనంతరం కౌన్సిల్ ఒక నిర్ణయానికి వచ్చి… ధనుష్ తో ఆగష్టు 15 తరువాత ఎవరైనా సినిమాలు చేయాలంటే తమ అనుమతి తీసుకోవాలని ప్రకటించింది. గతంలో విశాల్, శింబు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్న వారే. ప్రస్తుతానికి ధనుష్ మీద మాత్రమే చర్యలు తీసుకున్న మండలి, త్వరలో విశాల్ , శింబుపై కూడా చర్యలకు సన్నద్ధం అవుతుంది మండలి. గతంలో మండలి పై విశాల్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్నే లేపాయి. ‘మీ పని మీరు చేసుకోండి, అనవసరంగా నా జోలికి రాకండి.. నన్ను ఆపడం మీతరం కాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు
మొత్తానికి తమిళ ఇండస్ట్రీలో హీరోలు వైస్ ప్రొడ్యూసర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రొడ్యూసర్ల దగ్గర ఇలా అడ్వాన్స్ తీసుకుని ఏళ్ళు గడుస్తున్నా సినిమాలు చేయకుండా వేధిస్తున్న మరికొంతమంది నటులపై కఠిన చర్యలు వుండబోతున్నాయని కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన రాయం సినిమా గత వారం విడుదలై థియేటర్లలో ఉన్న సమయంలో ఈ వార్త రావడం తమిళనాడులో సంచలనం రేపింది.
ఇదే కాకుండా, ఓటీటీ విధులపై కూడా మండలి ఒక నిర్ణయానికి వచ్చింది. థియేటర్ విడులా ఓటీటీ విడుదలకు 8 వరాల గ్యాప్ తప్పనిసరి అని తీర్మానించింది. ఎడతెరిపి లేకుండా పెరుగుతున్న ఆర్టిస్టుల, టెక్నిషన్ల రెమ్యూనరేషన్ల అంశంపై అక్టోబర్ 31 కల్లా తమిళ సినిమాల నిర్మాణం పూర్తి చేయాలని.. ఆ తరువాత సినిమాల షూటింగ్లు సమస్యలు పరిష్కారం అయ్యేంతవరుకు నిలిపివేస్తాం అని మండలి ప్రకటించింది