మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మార్క్ స్టైల్ పెర్ఫార్మన్స్ తో పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, విరూపాక్ష లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. నువ్వు నాకు నచ్చావ్ లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ ఇచ్చిన కే విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో త్వరలో రిలీజ్ అవ్వబోతున్న ‘ఉషా పరిణయం’ అనే సినిమా రాబోతుంది. LOVE IS BEAUTIFUL అనేది ట్యాగ్ లైన్. ఆగష్టు 2న ఈ సినిమా విడుదల అవబోతుంది
ఈ సందర్భంగా స్టేజ్ పైన మాట్లాడుతున్న సమయంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సాయిధరమ్ సమాధానమిచ్చారు.. ‘మీ లవ్ గురించి చెప్పండి?’ అని యాంకర్ అడగగా… నాకు వన్ సైడ్ లవ్వే ఉంది. ఎవరైనా నచ్చి నేను మాట్లాడేలోపే మీకు ఆల్రెడీ పెళ్లయింది కదా అంటున్నారు… నేను షాక్ అయితే మీడియాలో వస్తుంది అంటున్నారు’.. అని నవ్వుతూ చెప్పాడు సాయిధరమ్ తేజ్.. తన పెళ్లిపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు మెగా హీరో సాయి ధరమ్
విరూపాక్ష, బ్రో తరువాత సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో ‘గాంజ శంకర్’ అనే సినిమా అనౌన్స్ అయ్యి ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిన సంగతి తెలిసిందే