తెలుగు రాష్ట్రాల్లో హీరోలు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఈనాటిది కాదు. ఎన్టీఆర్, ANR, కృష్ణల దగ్గర నుంచి నేటి యువతరం కధానాయకుల వరకు చాలామంది హీరోలు రాజకీయ నేతలతో మంచి బాండింగ్ ఉన్నవారే. గత దశాబ్ద కాలంగా ఇలా పొలిటీషియన్స్ తో ఫ్రెండ్షిప్ కొంచెం ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ లో నివసిస్తున్న మన తెలుగు హీరోలలో చాలామంది KTR తో మంచి అనుబంధం కలిగి ఉండేవారు
చాలామంది స్టార్లు వారి సినిమాల ఓపెనింగ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్, ట్రైలర్ ఈవెంట్స్ కు సైతం కే టీ ఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి పొగడ్తల వర్షం కురిపించారు. July 24 తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం. ప్రతీ ఏడాది KTR బర్త్డే రోజు ఆయనకు విష్ చేయడానికి మన హీరోలు పోటీపడేవారు. ఒకరి తరువాత ఒకారు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టిన రోజు సందేశాలను పంపించేవారు. కానీ ఈ ఏడాది అవేమి కనిపించలేదు.
ఒక్క హీరో, డైరెక్టర్ కూడా KTR కు బర్త్డే విషెస్ పోస్ట్ చేయలేదు. ఈ విషయం సోషల్ మీడియా లో చర్చాంశనీయమైంది. అధికారం వున్నప్పటి లేనప్పటికీ ఎంత తేడా వుంది అంటూ కొంతమంది కామెంట్ చేశారు. నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం… ఆరోజు మన హీరోలంతా పోటీపడి ఆయన బర్త్డే పోస్ట్లు పెడతారని కొంతమంది సర్కాస్టిక్ గా పోస్ట్లు పెట్టారు