తెలుగుదేశం పార్టీకి గత ఎలెక్షన్లలో ఒక ముఖ్యమైన అస్త్రం గత ప్రభుత్వం పెట్టిన లిక్కర్ పాలసీ. సామాన్య ప్రజలను రకరకాల మద్యం బ్రాండ్లతో మబ్బేపెట్టి, ఇష్టానుసారంగా రేట్లు పెంచి వారి జేబులను గుల్ల చేస్తున్నారు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ధ్వజమెత్తారు.
క్వాలిటీ మద్యం తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది.
తాజాగా ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు గత ప్రభుత్వంలో మద్యం పాలిసీపై విచారణ చేపట్టాలని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో మద్యం డిస్టిల్లరీస్, ఆల్కహాల్ సప్లై చైన్ నుంచి ఎంత వచ్చింది, ఎంత పోయిందో ఎవరికీ తెలీదు. వీటిపై సమగ్ర విచారణ జరగాలి. 5 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయిల నగదు అమ్మకాలు జరిగాయంటే ఇది చాలా పెద్ద స్కామ్. ఆ వాస్తవాలని ప్రజలకు తెలియాలి.. అందుకే మా ప్రభుత్వం దీన్ని సీబీ – సీఐడి ఎంక్వయిరీ కి ఇస్తూ. అవసరమైతే ED సపోర్ట్ తీసుకుంటామని వ్యాఖ్యానించారు చంద్రబాబు
అదేవిధంగా బూమ్ బూమ్ బీర్లపై చంద్రబాబు కామెంట్ చేశారు. దేశంలో వివిధ ప్రముఖ లిక్కర్ బ్రాండ్ల మద్యాన్ని ఏపీ నుంచి పారిపోయేలా చేశారు వైసీపీ వాళ్ళు. 2019 లో 31 బ్రాండ్లు దొరికేవి ఈరోజు రాష్ట్రంలో 2 మాత్రమే దొరికేలా చేసుకున్నారు. బూమ్ బూమ్ క్లాసిక్, స్ట్రాంగ్, సుపీరియర్ స్ట్రాంగ్ అంటూ రకరకాల బీర్లు తెచ్చారు అనగానే సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు నవ్వారు.