ఆగ్నేయ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో 600 మందికి పైగా మరణించారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి. దీంతో చాలా మంది తమ ప్రాణాలను నిద్రలోనే కోల్పోయారు. భూకంపం వల్ల సిరియాలో 245 మందికిపైగా చనిపోయారు. అదేవిధంగా టర్కీలోనూ 284 మందికిపైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
A Massive 7.8 Magnitude Earthquake has struck Central Turkey within the last hour, Severe Damage and multiple Casualties are being reported across the Region. pic.twitter.com/qILgKNAHMK
భూకంపం వల్ల పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం వల్ల టర్కీలో 2300 మందికి పైగా గాయాలపాలయ్యారు. పలు ప్రధాన నగరాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. చలికాలం కావడం వల్ల రోడ్లన్నీ మంచుతో కప్పుకుపోయాయి. భూకంపం తర్వాత కూడా 40కి పైగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలను ఇళ్లలోకి వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భారీ భూకంపం వల్ల గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.