»Businessman Assault Case Accused Saddam Sardar Arrested From Bengals Kultali
Businessman Assault Case: బెంగాల్ కుల్తాలీలో పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు సద్దాం సర్దార్
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీకి చెందిన వ్యాపారవేత్తపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సద్దాం సర్దార్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.
Businessman Assault Case: Accused Saddam Sardar Arrested From Bengal's Kultali
Businessman Assault Case: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీకి చెందిన వ్యాపారవేత్తపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సద్దాం సర్దార్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. సద్దాం నకిలీ బంగారు విగ్రహాల వ్యాపారంతో ప్రజలను మోసం చేశాడని, తద్వారా ప్రజల సొమ్మును దోచుకున్నాడని ఓ వ్యాపార వేత్త ఆరోపించారు. సోషల్ మీడియాలో నకిలీ బంగారు విగ్రహాలను విక్రయించి, వ్యక్తుల నుండి డబ్బు తీసుకొని, వస్తువులు సరఫరా చేయకుండా సర్దార్ చాలా మందిని మోసగించాడని పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో అతడు అరెస్ట్ అయ్యాడు.
కుల్తాలీ ప్రాంతంలోని కెయురాఖలి గ్రామంలోని ఆయన ఇంటిపై సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఇంట్లో ఒక రహస్య సొరంగాన్ని చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. దాదాపు 40 అడుగుల పొడవు ఉన్న ఈ సొరంగం బంగ్లాదేశ్‌కు దారి చూపుతున్నట్లు కనుగొన్నారు. దాన్ని తన బెడ్రూమ్ కింద ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ఓ వ్యాపారిపై సద్దాం దాడి చేసిన కేసులో పోలీసులు ఇంటిపై రైడ్ చేయగా ఆ సొరంగం బయటపడింది. అధికారులు ఇంటిపై సోదాలు చేసే సమయంలో వారిపై నిందుతులు కాల్పులు జరిపారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ మహిళలు సద్దాం సోదరుడు సర్దుల్ భార్యలు అని చెప్పారు. వీరితో పాటు కాల్పులు జరిపిన అఫ్తాబ్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. సోమవారం పోలీసులు రైడ్ చేయకపోతే బుధవారం సద్దాం ఆ సొరంగమార్గం గుండా బంగ్లదేశ్‌కు పారిపోయేవాడని గుర్తించారు. ఆ సొరంగం ఇండో-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దును దాటి సుందర్‌బన్స్‌లోని మాట్లా నదిలోకి ప్రవహించే ఒక కాలువకు అనుసంధానమై ఉందని పోలీసులు గుర్తించారు.