వినుకొండ లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. షేక్ రషీద్ అనే వైసీపీ కార్యకర్తను అతని మాజీ మిత్రుడు జిలాని అందరూ చూస్తుండగానే వినుకొండ ముండ్లమూరు బస్ స్టాండ్ సెంటర్ లో దారుణంగా నరికి హతమార్చాడు
హంతకుడు జిలాని తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాడని… టీడీపీ లో హత్య రాజకీయాలు పెరిగిపోయాయని వైసీపీ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తుంది. టీడీపీ కూడా వైసీపీ కి హత్యారాజకీయాలు కొత్త కాదని, ఎక్కడ శవం కనిపించిన వాళ్ళకి అదొక అవకాశంగా భావిస్తారని కౌంటర్ ఇచ్చింది..
ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులను పరామర్శించడానికి మాజీ సీఎం వై ఎస్ జగన్ ఈరోజు వినుకొండ రానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా వినుకొండ చేరుకుంటారు.
సోషల్ మీడియా లో టీడీపీ vs వైసీపీగా మారిన తరుణంలో మాజీ సీఎం జగన్ వినుకొండ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తారని రాజకీయవర్గాల్లో ఆశక్తి నెలకొంది