Joe Biden: US President Joe Biden is Corona positive
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా అతనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. కొవిడ్ టెస్టులు చేయించుకున్నారని.. ప్రస్తుతం అతని బాగానే ఉన్నట్లు తెలిపారు. అతని శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోలుకునేవరకు అందరికీ దూరంగా ఉంటానని తెలిపారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో బైడెన్ పాల్గొన్నారు. ప్రసంగానికి ముందుకు కరోనా టెస్టు చేయడంతో అందులో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నారు. తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు జీన్ పియర్ మీడియాకు వెల్లడించారు. ఆయనకు పాక్స్లోవిడ్ యాంటీ వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే ఎన్నికల బరిలో ప్రత్యర్థి ట్రంప్ కంటే వెనుకబడిపోయిన బైడెన్.. ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంతో ప్రజలకు మరింత దూరం కానున్నారు.