Useful Tips: దేశంలో రోజు రోజుకీ మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి. మలేరియా సోకడం వల్ల.. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మలేరియా జ్వరం.. దోమలు కుట్టడం వల్ల వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే… ఈ మలేరియా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అంతకంటే.. ముందు.. మలేరియా గురంచి కనీస అవగాహన ఉండాల్సిందే.
మలేరియా అంటే ఏమిటి?
మలేరియా అనేది అనాఫిలిస్ దోమ కాటు ద్వారా మానవులకు సంక్రమించే తీవ్రమైన వ్యాధి.
వ్యాధి సోకిన దోమ కుట్టిన 8 నుంచి 30 రోజులలోపు లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, అడపాదడపా అధిక జ్వరం, చలితో కూడిన జ్వరం, కండరాల నొప్పులు, అలసట , వాంతులు ప్రధాన లక్షణాలు. ప్రధాన నివారణ ప్రధానంగా దోమల నియంత్రణ. దోమల నిర్మూలన, దోమల లార్వాలను నాశనం చేయడం, దోమల కాటు నుండి స్వీయ రక్షణ కోసం చూడవలసిన మరో విషయం.
దోమలు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఇంటిని, పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
∙దోమల ఆవాసాలను నాశనం చేయండి.
కంటైనర్లు, సీసాలు మొదలైన వాటిలో నీరు పేరుకుపోనివ్వవద్దు.
బావి , నీటి ట్యాంకులను నెట్‌తో కప్పండి.
వర్షపు నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి
బెడ్‌పై దోమతెరను ఉపయోగించాలి.
శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించండి. ∙
దోమలు ఇంట్లోకి రాకుండా వలలను వేలాడదీయండి.
దోమతెరలు, ఎలక్ట్రిక్ రిపెల్లర్లు , ఉపయోగించండి.
మలేరియా జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యలను సంప్రదించాలి. దానికి తగిన చికిత్స తీసుకుంటే… ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.