సోషల్ మీడియాలో దేవర ఫ్యాన్స్ రోజు రోజు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ గురించి ట్రెండ్ చేస్తున్నారు. మరి థర్డ్ సాంగ్ ఎప్పుడు, దేవర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? అంటే, అప్పుడేనని అంటున్నారు.
Devara: 'Devara' second song ready.. third song, trailer just now?
Devara: ‘దేవర పార్ట్ 1’ రిలీజ్‌కు మరో రెండు నెలల పది రోజుల సమయం ఉంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు తమ తమ డబ్బింగ్ పూర్తి చేస్తున్నట్టుగా.. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో.. సెప్టెంబర్ 27న దేవర రావడం గ్యారెంటీ. అందుకే.. నెమ్మదిగా దేవర ప్రమోషన్స్ స్పీడప్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్‌కు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం టైగర్ ఫ్యాన్స్ అంతా రెండో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ పై ఈ వీకెండ్లోనే అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ లపై సాగే ఈ బ్యూటిఫుల్ మెలోడి.. వచ్చే వారంలో రిలీజ్ కానుందని సమాచారం. ఇక్కడి నుంచి దేవర అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. థర్డ్ సింగిల్‌ను ఆగష్టు సెకండ్ వీక్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ట్రైలర్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో రానుందని.. ఇక్కడి నుంచి దేవర ప్రమోషన్స్ గట్టిగా ఉంటాయని టాక్. ఇక సినిమా రిలీజ్‌కు ఒకటి, రెండు వారాల ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఫైనల్‌గా.. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా దేవర పార్ట్ 1 థియేటర్లోకి రానుంది. ఆరోజు బాక్సాఫీస్ దగ్గర వచ్చే దేవర తుఫాన్‌ను తట్టుకోవడం కష్టమని..యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నారు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.