»Narsapuram Mpdo What Happened To Narasapuram Mpdo
Narsapuram MPDO: నరసాపురం ఎంపీడీవో అసలు ఏమయ్యారు?
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయ్యారు. ఏలూరు కాల్వలో అతను దూకినట్లు పోలీసులు భావించారు. అతని మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేయగా.. విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద కట్ అయినట్లు గుర్తించారు.
Narsapuram MPDO: What happened to Narasapuram MPDO?
Narsapuram MPDO: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయ్యారు. ఏలూరు కాల్వలో అతను దూకినట్లు పోలీసులు భావించారు. అతని మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేయగా.. విజయవాడలోని మధురానగర్ ఏలూరు కాల్వ వద్ద కట్ అయినట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంపీడీవోగా పనిచేస్తున్న రమణరావు సెలవు రోజుల్లో ఇంటికి వస్తుంటారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందని చెప్పి వెళ్లారు.
ఆ రోజు రాత్రి 10 గంటలరే ఫోన్ చేసి తాను బందరులో ఉన్నానని, ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని తెలిపారు. అర్థరాత్రి దాటాక నా పుట్టిన రోజైన 16వ తేదీయే నేను చనిపోయే రోజు కూడా. అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్కు మెసేజ్ పంపించారు. అప్పటి నుంచి తన ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్ కూడా పనిచేయలేదు. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రమణరావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. ఎంపీడీవో అదృశ్యం వెనక మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ.లక్షల్లో బకాయిలు ఉండటమే కారణమని చెబుతున్నారు.