టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇవాళ ములుగు లోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజాలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్దమైంది. హాత్ సే హాత్ జోడో అభియాన్లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఉదయం 8 గంటలకు రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి.. వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గర ప్రత్యేక పూజలు చేస్తారు. తొలి విడతలో రేవంత్ రెడ్డి 60 రోజుల పాటు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేలా రూట్ మ్యూప్ను సిద్దం చేసుకున్నారు. అటు రాష్ట్రానికి చెందిన సీనియర్లు కూడా పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. జోడోయాత్రకు కొనసాగింపుగా ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో హత్ సే హత్ జోడో పేరుతో పాదయాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.