Prabhas: ప్రభాస్ కొత్త సినిమా టైటిల్.. దాదాపుగా ఫిక్స్?
ఒక్కొక్క సినిమా కాదు.. ఒక సినిమా కంప్లీట్ అవకముందే.. వరుసగా మూడు నాలుగు సినిమాలు లైన్లో పెడుతున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఓ సినిమా కమిట్ అవగా.. తాజాగా ఈ సినిమాకు టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని సమాచారం.
Prabhas: మూడో వారంలోను మంచి వసూళ్లను రాబడుతోంది కల్కి. ఇప్పటికే వెయ్యి కోట్లు కొల్లగొట్టి పలు రికార్డులు బద్దలు కొట్టిన కల్కి.. లాంగ్ రన్లో సెన్సేషనల్ మార్క్ దగ్గర ఆగేలా ఉందంటున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతుంది. ప్రభాస్ కూడా కల్కి సక్సెస్‌పై స్పందించాడు. ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. కల్కి మూవీని ఇంతపెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి, ఫ్యాన్స్‌కి చాలా చాలా థ్యాంక్స్.. మీరు లేకుంటే నేను జీరో.. కల్కి సెకండ్ పార్ట్ ఇంకా బిగ్గర్గా ఉండబోతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగానే.. మరోసారి ప్రభాస్, హనురాఘవపూడి సినిమా టైటిల్ వైరల్ అవుతోంది. కల్కి 2తో పాటు.. సలార్ 2, రాజాసాబ్, స్పిరిట్ సినిమాలు ప్రభాస్ లైనప్‌లో ఉన్నాయి.
అలాగే.. హను రాఘవపూడితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. పీరియాడిక్ యాక్షన్ జానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. అయితే.. ఇప్పటికే ఈ సినిమాకు’ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు రాగా.. ఇప్పుడు ఇదే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్టుగా సమాచారం. ఫౌజీ అంటే సైనికుడు. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందుకే.. ఫౌజీ టైటిల్ అనుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.