»Us President Joe Biden Is Hesitant Democrats Holding Their Heads
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాటు.. తలలు పట్టుకున్న డెమోక్రాట్స్
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మరోసారి నోరు జారాడు. దీంతో డెమోక్రాట్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా తడబడడం ఏంటని మదనపడుతున్నారు. ఈ సారి ప్రసంగిస్తూ యుద్దంతో ప్రజస్వామ్యాన్ని సాధిస్తామనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్‌గా మారాయి.
US President Joe Biden is hesitant.. Democrats holding their heads
Joe Biden: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీరు ఆ పార్టీ నేతల్లో టెన్షన్‌ను తీసుకొస్తుంది. మరోసారి బైడన్ తడబడ్డాడు. అయితే ఇటీవలే రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడి జరిగింది. దీనిపై అమెరికా ప్రజలను ఉద్దేశించి బహిరంగ ప్రసంగం ఏర్పాటు చేశారు. ఆ వేదికపై బైడన్ మాట్లాడుతూ.. బ్యాలెట్ అని పలకాల్సింది బ్యాటిల్ అని అన్నాడు. దీంతో బైడెన్ మానసిక స్థితిపై విమర్శలు చేస్తున్నవారిని మరో అస్త్రం దొరికినట్టైంది. ఇలా బైడన్ వరుసుగా వేదికలపై తడబడుతుండడంతో డెమోక్రాట్లు తలు పట్టుకుంటున్నారు. దీంతో బైడన్‌ను అధ్యక్ష రేసునుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తుంది.
ఈ బహిరంగా సభలో బైడన్ మాట్లాడుతూ.. “అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్ బాక్సును నమ్ముతాం. ఇప్పుడు కూడా మేం వాటిని బ్యాటిల్ బాక్సుల్లోనే పరిష్కరించుకొంటాం.. బుల్లెట్లతో కాదు” అని బైడెన్ అన్నారు. నిజానికి ఆయన బ్యాలెట్ బాక్స్‌లు అనాల్సింది, బాటిల్ బాక్సులు అన్నారు. బాటిల్ అంటే యుద్ధం. అంటే తమ విభేదాలు పరిష్కరించుకోవడానికి ఓట్లతో కాదు యుద్ధమే చేస్తాము అని అన్నారు. ఆయన మాటలతో పార్టీ నేతల, ఆయన సహాయకులు తలలు పట్టుకొన్నారు. దీనికి ముందు మీరు అధ్యక్షరేసులో ఉండకుంటే కమల హరీస్ ట్రంప్‌ను ఓడిస్తుందని మీరు భావిస్తున్నారా అంటే.. అధ్యక్షడిగా పనిచేసే అర్హత ఉపాధ్యక్షుడు ట్రంప్‌కు లేకుంటే అసలు తాను ఆ పదివికి ఎంపిక చేసే వాడిని కాదని అన్నారు. ఉపధ్యక్షులు కమల హరీస్ అనాలి కానీ ట్రంప్ అన్నారు. ఆ తరువాత నాటో కూటమి సమావేశాల్లో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పట్టుకుని పుతిన్ అని సంబోధించారు. దీనిపై బైడన్ ఆరోగ్య పరిస్థతిపై పలు ఆరోపణలు వస్తున్నాయి.