NLG: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మునుగోడు మండలం ఊకొండి లో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. అప్పాజీపేటకు చెందిన లక్ష్మీ ప్రసన్న (22) ఊకొండికి చెందిన బోయపల్లి నాగరాజు తో మార్చిలో వివాహమైంది. గురువారం అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీ ప్రసన్నను చికిత్స నిమిత్తం నల్గొండకు తరలించగా ఆసుపత్రిలో మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.