BDK: ఆళ్లపల్లి మండలం పాతూరు- పెద్దూరు మధ్య రూ. 80 లక్షలతో నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎన్నో సంవత్సరాలుగా చిన్నపాటి వర్షానికి కూడా వాగు పొంగి, ఇరు ప్రాంతాల మధ్య రవాణాకు ఏర్పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆయన తెలిపారు.