SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ జాతర గ్రామసభ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల జాతరలో చేపట్టే సీసీ రోడ్లు నిర్మాణాలు, జీపీ భవనాలు, అంగన్వాడి సెంటర్ల నిర్మాణాలు, వ్యక్తిగత లబ్దిదారులకు ఉపయోగపడే బర్ల షెడ్లు, గొర్ల షెడ్ల నిర్మాణాలు లాంటివి నిర్మాణాలకు కృషి చేస్తామని అన్నారు.