ATP: అర్హులైన వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లను కుంటి సాకులతో కూటమి ప్రభుత్వం తొలగించే నిర్ణయం మానుకోవాలని గౌని ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రాయదుర్గంలో ఆయన మాట్లాడారు. రెండు, మూడు దశాబ్దాలుగా పింఛన్లను అందుకుంటున్న వారికి పెన్షన్లకు అనర్హులు అంటూ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు.