KRNL: కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయం హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. లెక్కింపులో రూ.1,08,04,708/- బంగారు 1.90 గ్రాములు, వెండి 22.50కేజీలు భక్తులు సమర్పించినట్లు దేవస్థానం డిప్యూటీ కమీషనర్, కార్యనిర్వహణాధికారి కె.వాణి తెలిపారు. హుండీ పర్యవేక్షణ అధికారి బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ మద్య హుండీ లెక్కింపు జరిగిందని పేర్కొన్నారు.