CTR: వినాయక చవితి పురస్కరించుకుని గ్రామాల్లో వీధుల్లో రోడ్డు పక్కన ఏర్పాటు చేసే వినాయక స్వామి ప్రతిమ ఏర్పాటుకు పోలీసుల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకువాలని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ తెలిపారు. ఈ మేరకు వినాయక స్వామి ప్రతిమ ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే పోలీస్ శాఖ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని వెల్లడించారు.