SDPT: అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో స్టీల్ బ్యాంకును శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా అందించే స్టీల్ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య పాల్గొన్నారు.