NDL: జూపాడు బంగ్లాకు చెందిన ఆశా కార్యకర్త పార్వతి అనారోగ్యంతో మరణించారు. ఈ మేరకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆమె మృతదేహానికి శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పగిడాల మండల కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.