SRPT: చివ్వెంల మండలం కేంద్రంలో “పనుల జాతరను” జిల్లా కలెక్టర్ తేజస్ ఇవాళ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధులను మెరుగుపరచడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున “పనుల జాతర” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.