SKLM: జలుమూరు మండలం పెద్ద దూగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈవో ఎం.వరప్రసాదరావు ఆకస్మికంగా పరిశీలించారు. శుక్రవారం పాఠశాలకు చేరుకున్న ఆయన మొదటగా విద్యార్థుల రీడింగ్ పరిజ్ఞానాన్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. చదవటం నేర్పించాలని, అలాగే రాయడం కూడా అలవాటుగా చేస్తూ ఉండాలని ఆయన ఆదేశించారు. దీనివలన విద్యార్ధులుకు ఏకాగ్రత ఏర్పడుతుందని పేర్కొన్నారు.