AKP: జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఏపీ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అనకాపల్లిలో రామకృష్ణ మాట్లాడుతూ.. పశువుల అక్రమ రవాణా జిల్లా నుంచి జోరుగా సాగుతోందన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కబేళాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గో సంరక్షణకు గోశాలలను ఏర్పాటు చేయాలన్నారు.