NLR: రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కన్వీనర్ సి. హెచ్ అజయ్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా అత్యవసర పేషెంట్ కోసం శుక్రవారం 114వ సారి రెడ్ క్రాస్ లో రక్తదానం చేశారు. రక్త నిల్వలను పెంచడానికి యువత రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశోవర్ధన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.