నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ రేంజ్ కు వెళ్లడంపై స్పందించారు. మేము అమెరికాకు వెళ్లాం.. ఇటు జపాన్ కు వెళ్లాం.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు వెళ్లాం.. ఇటు ఆస్కార్ లో నాటు నాటు పాటకు నామినేషన్ దక్కింది. ఇదంతా మా గొప్పదనం కాదు. అభిమానించే అభిమానులు, ప్రేక్షక దేవుళ్లు మీ అందరి ఆశీర్వచనంతో పాటు తోటి నటీనటులు, ఇండస్ట్రీలో పని చేసే ఎంతోమంది కార్మికులు అందరి ప్రోత్సాహంతో అక్కడికి వెళ్లాం. కానీ.. అన్నింటి కంటే ముఖ్యం.. ఇది నా జక్కన్న విజయం. రాజమౌళి గారు ఆ చిత్రాన్ని తీశారు కాబట్టే.. మాకు ఆ పాత్రలు ఇచ్చారు కాబట్టే దానికి ఇంత ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రెడిట్, ప్రేమ మొత్తం రాజమౌళి గారికే దక్కాలి.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.