»Nda Leaders Are Criticizing That Lalu Prasad Yadav Uses Wheelchair Only When He Has To Go To Jail
Ambani Wedding : లాలూ ఏది మీ వీల్ ఛైర్.. ఎన్డీయే విమర్శలు
శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహానికి లాలూప్రసాద్ యాదవ్ వీల్ ఛైర్లో కాకుండా సాధారణంగా నడుస్తూ వచ్చారు. దీంతో విపక్షాలు ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నాయి. పూర్తి వివరాలను కింద చదివేయండి.
Lalu Prasad Yadav : ఇటీవల కాలంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వీల్ ఛైర్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. సాధారణంగా నడుస్తూ కనిపించడం లేదు. శుక్రవారం రాత్రి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు సైతం వచ్చారు. ఇండియా కూటమి నుంచి బెంగల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ- ఎస్పీ నేత సుప్రియా సూలేలతో పాటుగా లాలూ ప్రసాద్ యాదవ్(LALU PRASAD YADAV) కూడా హాజరయ్యారు. వివాహం చేసుకుంటున్న జంటను ఆశీర్వదించి వెళ్లారు.
సాధారణంగా చక్రాల కుర్చీకే పరిమితమై కనిపిస్తున్న లాలూ అనంత్ వివాహ వేడుక(ananth ambani wedding) సమయంలో మాత్రం నడుచుకుంటూ వచ్చారు. వీల్ ఛైర్ సాయం లేకుండా చక్కగా నిలబడ్డారు. దీంతో ఎన్డీయే నేతలు(NDA LEADERS) ఈ విషయమై మండి పడుతున్నారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, దర్యాప్తు సంస్థలు విచారించాల్సి వచ్చినప్పుడు మాత్రం లాలూ వీల్ ఛైర్కి పరిమితం అవుతున్నారని విమర్శించారు. లాలూ అలా సానుభూతి పొందాలని అనుకుంటున్నారని అంటున్నారు. మిస్టర్ లాలూ.. మీ వీల్ ఛైర్ ఎక్కడ అంటూ వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. దీంతో ఈ విషయాన్ని ఇండియా కూటమి సైతం తిరిగి ఖండించింది.