Tej Pratap Yadav : ఆనందం పట్టలేక సైకిల్ తొక్కుతున్న తేజ్ ప్రతాప్ యాదవ్
ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ (Tej Pratap) యాదవ్ సంబరపడిపోతున్నారు. తండ్రి లాలూ ఢిల్లీ నుంచి తిరిగి పట్నాకు వచ్చిన తరుణంలో సైకిల్ పై చక్కర్లు కొట్టారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఢిల్లీ నుంచి తిరిగి పట్నాకు వచ్చారు. తండ్రి లాలూ ప్రసాద్ తిరిటి పట్నాకు వచ్చిన ఆనందంలో ఆర్జేడీ నేత, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్(Tej Pratap) యాదవ్ సైకిల్ పై చక్కర్లు కొట్టారు. పట్నా(Patna) కు వచ్చినందుకు ఆనందం పట్టలేక సైకిల్ తొక్కి అన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ను సహాయకులు వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకువచ్చారు.సైకిల్ నడిపిస్తూ పర్యావరణాన్ని(environment) రక్షిస్తున్నాను” అని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ పలుసార్లు తేజ్ ప్రతాప్ యాదవ్ సైక్లింగ్ (Cycling) కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2018 జులైలో ఇటువంటి కార్యక్రమంలోనే పాల్గొని సైకిల్ తొక్కుతూ ఎదురుగా వచ్చిన టర్న్ వద్ద పడిపోయారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మళ్లీ సైకిల్ తొక్కుతూ కనపడడంతో అప్పటి వీడియోను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో కృష్ణాష్టమి (Krishnashtami) రోజున శ్రీకృష్ణుడి వేషం వేశారు. తన తమ్ముడు తేజస్వీ యాదవ్ కు తాను శ్రీ కృష్ణుడిలా బోధనలు చేస్తానని అన్నారు. తన తమ్ముడిని అర్జునుడిగా అప్పట్లో అభివర్ణించారు.
#WATCH | Patna: Bihar Minister and RJD leader Tej Pratap Yadav says, "I am delighted with the return of my father (Lalu Prasad Yadav). That is why, I am riding a bicycle. I am riding it and saving the environment." https://t.co/7p6nqw4HRzpic.twitter.com/2X4mPmWm1G