walking : ఆరోగ్యంగా ఉండేందుకు అసలు రోజుకు ఎంత సేపు నడవాలి?
ఆరోగ్యమైన జీవన విధానాన్ని పాటించేవారంతా దాదాపుగా రోజూ వాకింగ్‌కి వెళతారు. అయితే మనం ఫిట్‌గా ఉండాలంటే రోజుకు అసలు ఎంత సేపు నడవాలి? నిపుణులు ఏమంటున్నారంటే?
Walking for good health : నడక ఆరోగ్యానికి మంచిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది మాత్రమే దీన్ని పాటిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించేవారు మాత్రమే రోజూ వాకింగ్‌కి(walking) వెళుతుంటారు. అయితే రోజూ అసలు ఎంత సేపు నడవాలి? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ నడక నడిచే వారు వారానికి కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అంటే వారంలో కనీసం ఐదు రోజుల పాటు నడిచినా రోజుకు 30 నిమిషాల పాటు తప్పకుండా నడవాలి. ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రయోజనాలను(benefits) పొందాలని అనుకునే వారు ఎక్కువ వేగంతో ఇంటెన్సిటీతో నడవాలి. అప్పుడు శరీరం నుంచి ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. తద్వారా గుండెకు సంబంధించిన సమస్యలు తొందరగా రాకుండా ఉంటాయి. బీపీ, గుండె జబ్బుల్లాంటివి అన్నీ శరీరంలో కొవ్వులు పేరుకుపోవడం వల్లనే వస్తాయి. రక్తనాళాల్లో అవి ఎక్కువగా పేరుకోకుండా ఉండాలంటే కచ్చితంగా శ్రమ చేయాల్సిందే. తిన్న తిండికి సరిపడా పనులు, వ్యాయామాలు, వాకింగ్(walking)ల్లాంటివి తప్పనిసరి.
మామూలుగా నడవడం కంటే వేగంగా నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయమై పరిశీలన చేశారు. మామూలుగా నడిచే మహిళల్లో కంటే వేగంగా నడిచే మహిళల్లో గుండె ఆగిపోయే ప్రమాదం 34 శాతం తక్కువగా ఉండటం గుర్తించారు. కాబట్టి ఆరోగ్యం సహకరించే వారు కచ్చితంగా వేగంగా నడవడానికి(Speedy Walk) ప్రయత్నించాలి.