»Ukraine Buffer Offer To Prisoners We Will Release Them If We Fight
Ukraine: ఖైదీలకు బంఫర్ ఆఫర్.. యుద్ధం చేస్తామంటేనే విడుదల చేస్తాం
రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ రష్యాతో పోరాడుతుంది. యుద్ధ భూమి కోసం తీవ్రమైన సిబ్బంది కొరత కూడా ఉంది. అయితే సైన్యాన్ని పటిష్ఠం చేసేందుకు ఉక్రెయిన్ ముమ్మరంగా నియామకాలు చేపడుతోంది. ఈక్రమంలోనే తొలిసారిగా జైల్లోని ఖైదీలను మిలటరీలోకి తీసుకోవడానికి సిద్ధమైంది.
Ukraine: Buffer offer to prisoners.. We will release them if we fight
Ukraine: రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ రష్యాతో పోరాడుతుంది. యుద్ధ భూమి కోసం తీవ్రమైన సిబ్బంది కొరత కూడా ఉంది. అయితే సైన్యాన్ని పటిష్ఠం చేసేందుకు ఉక్రెయిన్ ముమ్మరంగా నియామకాలు చేపడుతోంది. ఈక్రమంలోనే తొలిసారిగా జైల్లోని ఖైదీలను మిలటరీలోకి తీసుకోవడానికి సిద్ధమైంది. రష్యా ఉక్రెయిన్ వార్‌లో చేరాలనుకునే వాళ్లపై కేసులు కొట్టేసి జైలు నుంచి విడుదల చేస్తామని ఉక్రెయిన్ ఆర్మీ ఖైదీలకు ఆఫర్ ఇచ్చింది. మీ నిర్భంద జీవితానికి ముగింపు పలకండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. దీనికోసం మీరు చేయాల్సింది ఒకటే. మీ మాతృభూమిని కాపాడుకోవడానికి ఫ్రంట్ లైన్లో పోరాడాలనింది.
ఖైదీలను సైన్యంలో తీసుకునేందుకు ఉక్రెయిన్ గత నెల పార్లమెంట్లో ప్ర్రత్యేక బిల్లును ఆమోదించింది. ఇప్పటికే 3000 మంది ఖైదీలను పైలట్ ప్రోగ్రామ్ కింద మిలిటరీ యూనిట్లలోకి తీసుకుంది. ఇప్పుడు మరో 27 వేల మంది కోసం కొత్త రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. అత్యాచారం, హత్య వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్లను అనర్హులుగా ప్రకటించింది. ఇంటర్వ్యూలో ఎంపికైన వాళ్లకు ఆర్మీ క్యాంప్‌ల్లో సాధారణ శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రోగ్రామ్‌కు ఖైదీల నుంచి మంచి స్పందన వస్తోంది.