Pawan kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో సీఐ హడావిడీ చేసిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఉన్న పవన్ ఆఫీస్‌లో టౌన్ సీఐ శ్రీనివాసరావు యాటిట్యూట్ ప్రదర్శించారు. సీఐ స్థానంలో ఉన్న శ్రీనివాసరావు ప్రోటో కాల్ పాటించలేదు. అధికార ప్రతినిధులను కలుసుకోవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలాంగి నియమాలు పాటించకుండా నేరుగా ఆఫీస్‌కు వచ్చారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారు. తనను అడ్డుకుంటారా అనే కోపంతో, వాళ్లతో గొడవపడి కార్యాలయంలోకి ప్రవేశించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ వారాహి పూజ చేస్తున్నారు. అదేది లెక్కచేయకుండా బూట్లతోనే ఆయన లోపలికి వెళ్లారు.
దీంతో భధ్రతా సిబ్బంది సీఐ ప్రవర్తన తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న అధికారులు సదరు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను మంగళగిరి టౌన్ సీఐగా నియమించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో కూడా మంగళగిరి జనసేన కార్యాలయంలో తనిఖీల పేరిట హడావిడి చేశారనే వార్తలు వచ్చాయి.