ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ విడుదలకు సిద్దం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు దేశాన్ని మొత్తం కుదిపేశాయి. ఇక సినిమాలో చాలా విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. చాలా వరకు తెరమీదనే చూడాలని మేకర్స్ అంటున్నారు.
Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకున్నాయి. సినిమా విడుదలకు రంగం సిద్ధం అయింది. మరి కొన్ని గంటల్లోనే అందరి ఆసక్తికి తెరపడనుంది. అయితే కిల్కిలో చాలా విషయాలు అంతర్లీనంగా దాగి ఉన్నాయని తెలుస్తుంది. అందులో భాగంగానే క్యారెక్టర్లు సైతం మిస్టరీగానే ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాలో పూర్తి క్యాస్టింగ్ గురించి కూడా చాలా మందికి తెలియదు.
కల్కిలో పాన్ ఇండియా స్టార్లను తీసుకున్నారు. టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ కూడా కల్కిలో ఓ మంచి రోల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగలే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో నటించబోతున్నాట్లు కూడా అర్థం అవుతుంది. అయితే ఇదే విషయాన్ని తాజాగా ప్రభాస్ వెల్లడించాడు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లతో పాటు చాలా స్టార్ కాస్ట్ ఉందంటూ ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా హీరో నాని కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.