»A Bomb Threat Was Sent To The Flight In Anger At The Crew
Bomb threat: సిబ్బంది మీద కోపంతో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు
సిబ్బందిమీద కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bomb threat: అనుకోని కారణం వలన తాము ప్రయాణించాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యారు. దీంతో టికెట్‌ను రీషెడ్యూల్ చేయాలని సిబ్బందిని రెక్వెస్ట్ చేశాడు. దానికి నిరాకరించిన అధికారుల మీద కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు బెదిరింపులకు(bomb threat) పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం కేరళలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి ముంబయి ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేశాడు. కొచ్చి – లండన్ గాట్విక్(Kochi – London Gatwick) ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందని, అది ఏ క్షణమైన పేలొచ్చని చెప్పాడు. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది తనిఖీలు చేపట్టారు. చాలా సేపు వారు గాలింపులు చేసిన తరువాత అది ఫేక్ న్యూస్ అని నిర్దారించారు. ఆ తరువాత విమానం లండన్‌కు బయలు దేరింది.
ఫ్లైట్ సేఫ్‌గా టేక్ ఆఫ్ అయిన తరువాత విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. షుహైబ్(30) అనే ప్రయాణికుడు లండన్ వెళ్లడానికి తన ఫ్యామిలతో సహా టికెట్స్ బుక్ చేసుకున్నారు. తన భార్య, కుమార్తెతో కలిసి AI 149 విమానంలో లండన్‌కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు బయలు దేరారు. అనుకోకుండా తన కూతురికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. దాంతో వాళ్ల ప్రయాణం వాయిదా వేసుకోవాలని, దాని కోసం తమ టికెట్లను మరో రోజు రీషెడ్యూల్ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను కోరారు. అందుకు ఎయిర్‌లైన్స్ నిరాకరించారు. దాంతో నిరాశ చెందిన షుహైబ్ ఈ ఘటనకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నారు.