Kalki 2898 AD: ‘కల్కి’ సెన్సార్ టాక్.. బ్లాక్ బస్టర్ అంతే!
ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ విడుదలకు మరో వారం రోజులే మిగిలున్నాయి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే లేని విధంగా 600 కోట్లకు పైగా బడ్జెట్‌తో.. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ టాక్ బయటికొచ్చేసింది.
Kalki 2898 AD: ఒక రోజు ముందుగానే యుఎస్ సహా పలు దేశాల్లో కల్కి 2898 ఏడి ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఇండియాలో గురువారం రిలీజ్ కానున్న నేపథ్యంలో.. లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. రేపో మాపో ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే యుఎస్‌లో ప్రి సేల్స్ ద్వారా 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రిలీజ్ టైంకి ఆ లెక్క మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటిని తిరగ రాస్తుందని అంటున్నారు. మరో వైపు మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ముంబైలో హల్చల్ చేస్తున్నాడు. ఇప్పటికే ముంబైకి చేరుకున్నాడు డార్లింగ్. కల్కి ప్రీ రిలీజ్ చాప్టర్ ముంబై.. ఈరోజు సాయంత్రం 6 గంటలకి గ్రాండ్ ఈవెంట్ జరగబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. కల్కి సెన్సార్ టాక్ బయటికి రాగా.. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే ఉంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. రన్ టైం వచ్చేసి 2 గంటల 58 నిమిషాలుగా తెలిసింది. అంటే.. దాదాపు మూడు గంటల రన్ టైంతో కల్కి థియేటర్లోకి రాబోతోంది.
అయితే.. సెన్సార్ రివ్యూని బట్టి చూస్తే.. ఈ రన్ టైం చాలా తక్కువ అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. సినిమా అంత అద్భుతంగా ఉందట. సెన్సార్ సభ్యులు కల్కిలో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి చిత్ర యూనిట్‌కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విజువల్స్‌తో పాటు ఎమోషన్స్ పీక్స్‌లో ఉందని చెబుతున్నారు. ఎంట్టైన్మెంట్ అన్నీ సమ పాళ్లలో ఉన్నాయని.. ఇలాంటి విజువల్స్ గతంలో ఎప్పుడూ చూడలేదని సెన్సార్ సభ్యులు అభిప్రాయ పడినట్లుగా తెలుస్తోంది. భైరవ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించాడని అంటున్నారు. అలాగే.. ముందు నుంచి వినిపిస్తున్నట్టుగా.. ఈ సినిమాలో ఊహించని అతిధి పాత్రలు ఉన్నాయని.. క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా.. కల్కి సెన్సార్ టాక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.