»Saudi Arab Hajj Pilgrims Die In Mecca As Temperatures Rises
Hajj Pilgrims : హజ్ యాత్రలో మృత్యుఘోష.. 550మందికి పైగా యాత్రికులు మృతి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. భారతదేశంలో వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 65 దాటింది. గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది.
Hajj Pilgrims : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. భారతదేశంలో వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 65 దాటింది. గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే సౌదీ అరేబియాలో వాతావరణంలో విపరీతమైన వేడి ఉంది. కానీ ఈసారి అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. విపరీతమైన వేడి కారణంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
మరణించిన హజ్ యాత్రికులలో ఎక్కువ మంది ఈజిప్టుకు చెందిన 323 మంది ఉన్నారు. 60 మంది జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు. మంగళవారం వరకూ ఈ యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారితో పాటు చనిపోయిన హజ్ యాత్రికులలో అనేక దేశాల పౌరులు కూడా ఉన్నారు. ఇస్లాం ఐదు ముఖ్యమైన ప్రదేశాల్లో హజ్ ఒకటి. ముస్లింలు అంతా తమ జీవితంలో ఒక్క సారైనా మక్కాకు వెళ్లాలని కోరుకుంటారు.
గత నెలలో విడుదల చేసిన సౌదీ నివేదిక ప్రకారం.. వాతావరణ మార్పుల వల్ల హజ్ యాత్ర గణనీయంగా ప్రభావితమవుతోందని, హజ్ చేసే ప్రదేశాలలో ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీల సెల్సియస్ (0.72 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం మక్కా మసీదులో ఉష్ణోగ్రత 51.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గతేడాది హజ్ సమయంలో వేడి కారణంగా సుమారు 240 మంది యాత్రికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియా పౌరులు. సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేడి కారణంగా అస్వస్థతకు గురైన సుమారు రెండు వేల మంది హజ్ యాత్రికులు చికిత్స పొందుతున్నారు. కైరో హజ్లో అదృశ్యమైన ఈజిప్షియన్ల కోసం సౌదీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.