»Prabhas Kalki Created The Record Before The Release
Kalki: విడుదలకు ముందే రికార్డు క్రియేట్ చేసిన కల్కి
ప్రభాస్ హీరోగా నిర్మితమైన కల్కి సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ప్రీ సేల్ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా రెండు మిలియన్ల మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డును తిరగరాసేందుకు సిద్ధమౌతోంది.
Prabhas Kalki created the record before the release
Kalki: ప్రభాస్ హీరోగా నిర్మితమైన కల్కి సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ప్రీ సేల్ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా రెండు మిలియన్ల మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డును తిరగరాసేందుకు సిద్ధమౌతోంది. ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ . జూన్ 27న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. విడుదలకు కొద్ది రోజులే ఉండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. దీంతో ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రీ బుకింగ్స్ విషయంలో హవా చూపిస్తోంది.
ఓవర్సీస్లో కల్కి ప్రీ బుకింగ్స్ ఇటీవల ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఆ సేల్ రెండు మిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ డాలర్ల బిజినెస్ జరగడం విశేషం. సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అమ్మకాలు జరిగిన తొలి భారతీయ సినిమాగా కల్కి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మూవీ రిలీజ్‌కు ఇంకా 7 రోజుల సమయం మాత్రమే ఉండడంతో బిజినెస్ మరింత పెరిగే అవకాశముందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా కల్కీ హవా నడుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 5000 టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు కల్కి ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో పాటు హీరో ప్రభాస్ నాన్‌స్టాప్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేస్తున్నారు. వరల్డ్ ఆఫ్ కల్కి పేరుతో వీడియోస్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కీలకమైన వాహనం బుజ్జి సందడి చేస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర ….. బుజ్జీని డ్రైవ్ చేసి చూశారు. దేశంలో ప్రముఖ నగరాల్లో బుజ్జి సందడి చేస్తోంది. అలాగే ప్రచారంలో భాగంగా ఇటీవలే భైరవ యాంథమ్‌ను కూడా విడుదల చేశారు. యాంథమ్ వీడియో 5 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.