sim cards : మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చిలా
కొంత మంది ఎప్పటి కప్పుడు కొత్త సిమ్ కార్డుల్ని తీసుకుని పాత వాటిని అలానే వదిలేస్తుంటారు. మరసలు మన పేరున ఎన్ని నెంబర్లు ఉండొచ్చు. మన ఆధార్‌పై గరిష్ఠంగా ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చు? తెలుసుకుందాం రండి.
sim cards : మనం ఎప్పుడైనా కొత్త నెంబర్ తీసుకుంటున్నప్పుడు పాత నెంబర్ని కచ్చితంగా బ్లాక్ చేయించుకోవాలి. అలా కాకుండా అలా వదిలేస్తే మనకే మంచిది కాదు. అలాగే మనం అసలు ఎన్ని సిమ్ కార్డుల్ని తీసుకోవచ్చు? మన ఆధార్‌కు(aadhar) లింక్ అయి ఎన్ని నెంబర్లు ఉండొచ్చు. అలా ఎన్ని ఉన్నాయో ఎలా తెలుసుకోవచ్చు? అన్ని విషయాలూ ఇక్కడున్నాయి. చదివేయండి.
సిమ్ కార్డులు ఫ్రీఆఫ్ కాస్ట్‌తో లభిస్తుంటాయి. దీంతో మంచి నెంబర్లు దొరకడం వల్లనో, వేరే కారణాల వల్లనో చాలా మంది కొత్త నెంబర్లను తరచుగా తీసుకుంటూ ఉంటారు. పాత వాటిని బ్లాక్ చేయించకుండా అలానే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి సైబర్ నేరగాళ్లకు దొరికితే ఇక అంతే. వాటితో వారు చాలా రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం ఈ సిమ్ కార్డుల(sim cards) జారీ నిబంధనలను కఠినతరం చేసింది. ఆ నిబంధనల ప్రకారం ఒక్కో ఆధారకార్డుపై(aadhar card) గరిష్ఠంగా తొమ్మిది వరకు సిమ్ కార్డులు ఉండొచ్చు.
అలాగే ఒక వ్యక్తి ఒకే సారి బల్క్‌గా సిమ్ కార్డుల్ని తీసుకోవడంపైనా నిషేధం విధించారు. మరి ఒక వేళ మనకు తెలియకుండానే మన ఆధార్ పై సిమ్ కార్డులు తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. అందుకనే మన పేరున ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఓ ఆప్షన్ ఉంది. ఇందుకోసం డాట్.. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ అన్స్యూమర్ ప్రొటక్షన్ (TAF-COP) అనే ఓ ఫ్లాట్ ఫాంని విజిట్ చేయవచ్చు. ఈ సైట్లోకి వెళ్లి మన ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు జారీ అయి ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైనా మన మొబైల్‌ని దొంగిలించినప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్లి దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే సంచార్ సాథి అనే మరో వెబ్సైట్ కూడా ఉంది. అందులో లాగిన్ అవ్వాలి. సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ‘నో యువర్ మొబైల్ కనెక్షన్స్’పై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ పేరున ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలిసిపోతుంది.