సమంత మయోసైటిస్ బారిన పడడంతో.. ఆమె అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. కానీ అమ్మడు జెట్ స్పీడ్‌లో కోలుకుంది. అదే స్పీడ్‌లో షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ముందుగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో అడుగుపెడుతుందని అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం విజయ్‌కి హ్యాండ్ ఇచ్చి బాలీవుడ్‌కు చెక్కేసింది. ఈ సందర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కు సారీ కూడా చెప్పింది. త్వరలోనే ఖుషి షూటింగ్లో జాయిన్ అవుతానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 డైరెక్టర్స్‌తో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేయబోతోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్గా వర్క్ మోడ్‌లో ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసింది. అలాగే హాస్పిటల్లో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్ కూడాపెట్టింది. కష్టకాలం ముగిసింది.. ఇక ఊపిరి పీల్చుకో పాపా.. త్వరలోనే అంతా మామూలుగా అయిపోతుంది.. ఇది నువ్వు సాధించిన గొప్ప విజయం.. నీ పట్ల ఎంతగానో గర్విస్తున్నానని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో పాటు వర్కౌట్ చేస్తున్న ఫోటోలని పంచుకుంది. జిమ్ ట్రైనర్‌తో కలిసి యాక్షన్ సీక్వెన్స్ కోసం కండలు పెంచుతున్నట్టుగా పోజులు ఇచ్చింది. దీంతో సామ్ షూటింగ్‌కి సిద్దమైందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 17న శాకుంతలం మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దాంతో త్వరలోనే సమంత ప్రమోషన్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. రేపో మాపో దీనిపై క్లారిటీ రానుంది. ఏదేమైనా సమంత ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు.